Elders say that it is a great sin to scold while eating food. It is suggested to eat calmly | భోజనం చేసే ముందు కూడా నియమాలు పాటించాలి. భోజనం చేసేటప్పుడు ఆ భోజనం పట్ల భక్తిభావం ఉండాలి. ఇక భోజన సమయంలో తిట్టటం కూడా దోషకారణం. పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు తిడుతూ ఉంటారు. ఇక ఒక్కొక్కసారి వాళ్లు భోజనం చేసే సమయంలోనే పెద్దవాళ్లు పిల్లలపై ఆగ్రహం ప్రదర్శిస్తారు. తల్లిదండ్రులు తిట్టారు అన్న బాధలో, ఆవేదనను అణుచుకుంటూ పిల్లలు భోజనం చేస్తే అది వంట పట్టదని, తద్వారా పలు అనారోగ్య సమస్యలు వస్తాయని పెద్దలు చెబుతుంటారు. అందుకే భోజనం చేసే సమయంలో ఎప్పుడూ పిల్లల్ని తిట్టకూడదని సూచిస్తూ ఉంటారు.
#Food
#Health
#National
#AndhraPradesh
#Telangana
#India
#Astrology